Most Eligible Bachelor : అఖిల్‌కి సపోర్ట్ అందించేందుకు వ‌స్తున్న అల్లు అర్జున్..!

October 18, 2021 11:05 PM

Most Eligible Bachelor : అక్కినేని అఖిల్ న‌టించిన తొలి మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చిన విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా డస్కీ బ్యూటీ పూజా హెగ్డేతో కలిసి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌లకరించాడు. ఈ సినిమాకు సినీ ప్రియులు, అభిమానులతో పాటు విమర్శకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది.

Most Eligible Bachelor allu arjun to attend success meet

క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం వైజాగ్‌లో థ్యాంక్యూ మీట్ జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన అఖిల్ సీఎం జ‌గ‌న్‌కి అలాగే ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. ఇక తాజా స‌మాచారం మేర‌కు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” టీమ్ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను మంగళవారం జరుపుకోబోతోంది.

స‌క్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను చిత్రబృందం ఆహ్వానించింది. సక్సెస్ మీట్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటారు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించగా, గోపి సుందర్ సంగీతం అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment