Mohanbabu : మోహన్‌బాబు, చిరంజీవిల మధ్య విభేదాలు.. క్లారిటీ వచ్చేసినట్లే..?

November 4, 2021 6:54 PM

Mohanbabu : ఇన్నాళ్లూ వెండితెర‌పై సంద‌డి చేసిన బాల‌కృష్ణ ఇప్పుడు డిజిట‌ల్ ఇంట్రీ ఇచ్చారు. అల్లు అర‌వింద్ ఆహా కోసం హోస్ట్‌గా మారారు. అన్‌స్టాప‌బుల్ అనే షోకి బాల‌య్య హోస్ట్‌గా ఉండ‌గా, తొలి గెస్ట్‌గా మోహ‌న్ బాబు వ‌చ్చారు. ఆయ‌న నుండి అనేక స‌మాధానాలు రాబ‌ట్టారు బాల‌య్య‌. మధ్య మధ్యలో మోహన్ బాబు కూడా బాలకృష్ణకు ప్రశ్నలు వేశారు. ఆద్యంతం ఈ మొదటి ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా, నవ్వులతో సాగింది.

Mohanbabu and chiranjeevi differences might given clarity

చిరంజీవి గురించి బాల‌య్య ప్ర‌శ్న వేయ‌గా, దానికి మోహన్ బాబు .. చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. అల్లు రామలింగయ్య గారితో కలిసి నేను ఎన్నో సినిమాలు చేశాను. సురేఖ నాకు సోదరిలాంటిది.

మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. మన ఇంటి అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టే అతను బాగున్నాడు అని ఆసక్తిగా సమాధానం ఇచ్చారు. మోహ‌న్ బాబు చెప్పిన స‌మాధానం చూస్తుంటే ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్ధ‌లు లేవ‌నే అభిప్రాయం క‌లుగుతోంది. మా ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో మోహ‌న్ బాబు, చిరంజీవి మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి.. అనే వార్త‌లు రాగా, దానిపై ఈ ఇంట‌ర్వ్యూ ద్వారా క్లారిటీ వ‌చ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment