Mohan Babu : అంద‌రి ముందే శివ బాలాజీ భార్య‌పై నోరు పారేసుకున్న మోహ‌న్ బాబు..!

October 17, 2021 3:02 PM

Mohan Babu : గ‌త కొద్ది రోజులుగా మోహ‌న్ బాబు వార్త‌ల‌లో తెగ నానుతూ వ‌స్తున్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌లో అంతా తానై ముందుకు న‌డిచాడు. విష్ణుకి స‌పోర్ట్‌గా ఉంటూ ఎల‌క్ష‌న్స్ ర‌క్తి క‌ట్టేలా చేశాడు. మంచు విష్ణు గెలుపులో తాను స‌గ భాగం అయ్యాడు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న ఓ సంద‌ర్భంలో శివ బాలాజీ భార్య‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Mohan Babu angry on shiva balaji wife

‘నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరోగా చేశాను. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. పాలిటిక్స్‌లో కంటే ఇక్కడే రాజ‌కీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా ? అని ఆశ్చర్యపోయానని.. మోహన్‌ బాబు పేర్కొన్నారు. అయితే మోహన్ బాబు సీరియ‌స్‌గా ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శివ బాలాజీ భార్య, నటి మధుమిత కాస్త హ‌డావిడి చేసింది.

మోహన్ బాబు ప్రసంగిస్తుంటే.. మధ్యలో అటూ ఇటూ కదిలింది. దీంతో కోపోద్రిక్తుడైన మోహన్ బాబు.. ఏయ్.. అలా అటూ ఇటూ కదలొద్దు.. ఒకరు ప్రసంగం ఇస్తుంటే అలా కదిలితే.. శ్రద్ద దెబ్బ తింటుంది.. అలా చేయకు.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మ‌ధుమిత‌పై మోహ‌న్ బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment