Chandra Babu Naidu : చంద్ర‌బాబుకు సిగ్గులేదు.. లోకేష్ కొండెర్రిపప్ప..

October 21, 2021 8:00 PM

Chandra Babu Naidu : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌నయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వారిద్ద‌రిపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా.. ఏపీ అంత‌టా గురువారం జనాగ్రహ దీక్షల‌ను నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన దీక్ష‌లో రోజా పాల్గొని మాట్లాడారు.

mla rk roja comments on Chandra Babu Naidu and lokesh

చంద్రబాబు నాయుడు, లోకేష్‌, ప‌ట్టాభిలు సీఎం జ‌గ‌న్‌ను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని రోజా డిమాండ్ చేశారు. ప‌ట్టాభి లాంటి కుక్క‌ల‌తో సీఎం జ‌గ‌న్‌ను తిట్టించిన చంద్ర‌బాబుకు సిగ్గులేద‌ని, లోకేష్ ఒక కొండెర్రిప‌ప్ప అని రోజా ఆరోపించారు. చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ను తిట్టిస్తే భువ‌నేశ్వ‌రి ఊరుకుంటారా ? అని రోజా ప్ర‌శ్నించారు.

కుట్రపూరిత రాజకీయాలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని రోజా ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ బూతులకు తెగబడుతుంద‌ని, బ‌ద్వేలులో మీ బతుకేంటో తేలిపోతుంద‌ని అన్నారు. మ‌రోవైపు ఏపీ అంత‌టా జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌ను వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున చేప‌ట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now