Meenakshi Seshadri : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా ? ఇప్పుడు ఎక్క‌డుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

June 22, 2022 11:25 AM

Meenakshi Seshadri : సినిమా ఇండ‌స్ట్రీలో హీరోలు చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను కొన‌సాగిస్తారు. కానీ హీరోయిన్లు అలా కాదు. కొన్నేళ్ల పాటు మాత్ర‌మే వారి కెరీర్ ఉంటుంది. త‌రువాత పెళ్లి చేసుకుని స్థిర ప‌డుతుంటారు. అయితే ఇలాంటి వారిలో కొంద‌రు పెళ్లి అనంత‌రం మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మీనాక్షి శేషాద్రి ఒక‌రు. ఈమె అప్ప‌ట్లో టాప్ హీరోయిన్‌గా ఉండేది. కానీ వివాహం అనంత‌రం ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. ప్ర‌స్తుతం ఈమె వివాహం చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయింది.

మీనాక్షి శేషాద్రి పేరు చెప్ప‌గానే ఈమె మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టించిన ఆపద్బాంధ‌వుడు సినిమానే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. అయితే ఈమె ఇదే కాదు.. ఇంకా అనేక చిత్రాల్లో న‌టించింది. ఈమె అస‌లు పేరు శశిక‌ళ శేషాద్రి. జార్ఖండ్ రాష్ట్రంలోని సింధి అనే ప్రాంతంలో జ‌న్మించింది. వీరి కుటుంబం మొత్తం త‌మిళ నేప‌థ్యం ఉన్న‌వారే. ఇక మీనాక్షి శేషాద్రి మంచి నృత్యకారిణి. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, క‌థ‌క్, ఒడిస్సీ లాంటి నృత్యాల్లో ఈమెకు ప్రావీణ్య‌త ఉంది. అప్ప‌ట్లో ఆమె మిస్ ఇండియాగా కూడా ఎంపికైంది.

Meenakshi Seshadri how she is now what she is doing
Meenakshi Seshadri

మీనాక్షి శేషాద్రి అప్ప‌ట్లో టాప్ మోడ‌ల్‌గా కూడా ఉంది. ఈమె అమితాబ్ బ‌చ్చ‌న్‌, రాజేష్ ఖ‌న్నా, అనిల్ క‌పూర్‌, స‌న్నీ డియోల్ వంటి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. అలాగే ఎన్‌టీఆర్‌, బాల‌య్య క‌ల‌సి న‌టించిన విశ్వామిత్ర అనే మూవీలో మేన‌క పాత్ర‌ను పోషించింది. 1980-90ల‌లో ఈమె భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు ఇప్పుడు 57 ఏళ్ల‌కు పైగానే ఉంటాయి. దీంతో ముఖంలో వృద్ధాప్య ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఈమెను సుల‌భంగానే గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. ఇక ఈమె ప్ర‌స్తుతం అమెరికాలో సెటిల్ కాగా.. అక్క‌డే చాలా మందికి నాట్యం నేర్పిస్తోంది. కానీ సినిమా ఇండ‌స్ట్రీకి మాత్రం దూరంగా ఉంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now