Master Chef : టీవీ షోల నిర్వాహకులు రేటింగ్స్ కోసం ఎన్నో చేస్తుంటారు. సెలబ్రిటీలను తీసుకువచ్చి సందడి చేస్తుంటారు. ప్రోమోలతో అదరగొడుతుంటారు. అయితే షోలో ప్రేక్షకులకు కావల్సిన వినోదం లేకపోతే వారు చూడరు. దీంతో రేటింగ్స్ గణనీయంగా పడిపోతుంటాయి. ఈ క్రమంలో అలాంటి షో లను ఆపేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే మాస్టర్ చెఫ్‌కు వచ్చిందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
మాస్టర్ చెఫ్‌లో ముందుగా తమన్నాను యాంకర్‌గా తీసుకున్నారు. కొన్ని రోజులు షో బాగానే నడిచింది. రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు, రేటింగ్స్ సడెన్‌గా పడిపోయాయి. దీంతో తమన్నాను తప్పించిన నిర్వాహకులు ఆమె ప్లేసులో అనసూయను తెచ్చి పడేశారు.
తమన్నా అయితే ఎక్కువ మొత్తం ఇవ్వాలి కదా. అనసూయ అయితే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా సరిపోతుంది, పైగా రేటింగ్స్ పెద్దగా లేవు, రెవెన్యూ రావడం లేదు.. అనుకున్న నిర్వాహకులు తమన్నాకు బదులుగా అనసూయను యాంకర్‌గా మార్చారు.
అయితే నిజానికి ఇప్పుడు రేటింగ్స్ ఇంకా పడిపోయాయి. తమన్నా ఉన్నప్పుడే అంతో ఇంతో బెటర్‌గా ఉన్న రేటింగ్స్ ఇప్పుడు ఇంకా పడిపోయినట్లు తాజాగా వచ్చిన బార్క్ రేటింగ్స్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఏం చేయాలా ? అని షో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారట. మరి ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…