గురువారం, జూన్ 11, 2026
వినోదం

Mansur Ali Khan : అన్నంత ప‌ని చేసిన త‌మిళ న‌టుడు.. చిరంజీవితోపాటు మ‌రో ఇద్ద‌రిపై పరువు నష్టం దావా..

Mansur Ali Khan : త‌మిళ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ పేరు ఇటీవ‌ల వార్త‌ల‌లో తెగ వినిపించింది. ‘లియో’ మూవీ గురించి మాట్లాడ‌నన ఆయ‌న ఆ సినిమాలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ…

Mansur Ali Khan : అన్నంత ప‌ని చేసిన త‌మిళ న‌టుడు.. చిరంజీవితోపాటు మ‌రో ఇద్ద‌రిపై పరువు నష్టం దావా..

Mansur Ali Khan : త‌మిళ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ పేరు ఇటీవ‌ల వార్త‌ల‌లో తెగ వినిపించింది. ‘లియో’ మూవీ గురించి మాట్లాడ‌నన ఆయ‌న ఆ సినిమాలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిష‌తో నేను చేసే స‌న్నివేశాలలో ఒక్క స‌న్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని ముందుగా ఊహించాను. నా మునుప‌టి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిష‌ను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని ఎంతో ఆశించాను. కాని ద‌ర్శ‌కుడు త్రిష‌ని నాకు చూపించ‌లేదు. గ‌తంలో నేను ఎన్నో రేప్ సీన్స్ చేశాను. అవి నాకు కొత్త కాదు అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మ‌న్సూర్.ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అయింది. త్రిష కు మద్దతుగా చిరంజీవి, ఖుష్బూ, లోకేష్ కనగరాజ్, నటి మాళవిక మోహన్, చిన్మయి, హీరో నితిన్ తదితరులు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

మ‌న్సూర్ వ్యాఖ్య‌ల‌పై త్రిష కూడా స్పందిస్తూ.. తన కెరీర్లో మిగతా సినిమాలలో అతను లేకుండా ఉండేలా చూసుకుంటానని, స్త్రీలను అగౌరవించే విధంగా, లైంగికంగా వేధించే విధంగా, అసహ్యంగా అతని మాటలు ఉన్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక త్రిష వ్యాఖ్యలకు మద్దతునిస్తూ చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు నటులు మన్సూర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అన్నారు. కాని మ‌న్సూర్ మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చి చెప్పారు. అయితే, పరిస్థితి తీవ్రత నేపథ్యంలో త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వివాదం అంతా ముగిసింది అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రోసారి ఈ గొడ‌వ కొత్త‌ రూపం సంత‌రించుకుంది.

Mansur Ali Khan files law suit against chiranjeevi and two others
Mansur Ali Khan

త్రిష‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌ర్వాతి రోజు త‌న‌ని అవ‌మానించిన క్ర‌మంలో త్రిష‌కు, ఖుష్బూ, చిరంజీవిల‌కు పరువునష్టం కింద‌ నోటీసులు పంపిస్తున్నానంటూ మ‌న్సూర్ కామెంట్ చేశారు. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే త్రిష‌కు, ఖుష్బూ, చిరంజీవిల‌పై శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ధనంజయన్ ద్వారా కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. ఇక ఈ పిటిషన్‌లో వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని మన్సూర్ అలీఖాన్ స్ప‌ష్టం చేశాడు. డిసెంబర్ 11న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందుకి ఈ కేసు విచారణకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.