గురువారం, జూన్ 11, 2026
వినోదం

Mansoor Ali Khan : ఓల్డ్ హీరోయిన్స్‌తో పార్టీలు.. వేల కోట్లు తిన్నాడంటూ చిరుపై మ‌న్సూర్ ఫైర్..

Mansoor Ali Khan : మ‌న్సూర్ అలీ ఖాన్ పేరు నెట్టింట తెగ మారుమ్రోగ‌గిపోతుంది.హీరోయిన్ త్రిష కృష్ణన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆపై అదంతా పెద్ద చర్చకు దారి తీయడం, సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న‌పై తీవ్ర…

Mansoor Ali Khan : ఓల్డ్ హీరోయిన్స్‌తో పార్టీలు.. వేల కోట్లు తిన్నాడంటూ చిరుపై మ‌న్సూర్ ఫైర్..

Mansoor Ali Khan : మ‌న్సూర్ అలీ ఖాన్ పేరు నెట్టింట తెగ మారుమ్రోగ‌గిపోతుంది.హీరోయిన్ త్రిష కృష్ణన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆపై అదంతా పెద్ద చర్చకు దారి తీయడం, సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం దాంతో మ‌న్సూర్ క్ష‌మాప‌ణలు చెప్ప‌డం జ‌రిగింది. అయితే త్రిష‌కి మ‌న్సూర్ సారీ చెప్పిన త‌ర్వాత వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్టే అని అంద‌రు భావించారు. కాని త్రిషకు సపోర్ట్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూలపై కేసును పెడతానంటూ కూడా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. చిరంజీవి మీద రూ. 20 కోట్లు, త్రిష కుష్బూల మీద రూ. 10 కోట్ల చొప్పున దావా వేస్తున్నట్టుగా తాజాగా మన్సూర్ తెలిపాడు.

త్రిష‌కి స‌పోర్ట్ చేసిన చిరంజీవి మీద దారుణమైన కామెంట్లు చేశాడు మ‌న్సూర్. నాది వక్ర బుద్ది అన్నాడు కదా.. పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి సాయం చేయలేదు అని విమర్శించాడు. ఏడాదికి ఒకసారి ఓల్డ్ హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి పార్టీలు చేసుకుంటారని, వాళ్లతో వీళ్లతో పార్టీలు చేసుకునేందుకు ఆయనకు సమయం ఉంటుంది కానీ.. కానీ నాలాంటి వాళ్లకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అని అడిగే సమయం ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష విషయంలో స్పందించే ముందు చిరంజీవి కనీసం తనకు ఫోన్ చేయాల్సిందని , ఏం జ‌రిగింది, ఏంటి అని కూడా అడ‌గ‌కుండా ఇలా కామెంట్ చేయ‌డం ఏం బాగోలేదు అంటూ నిప్పులు చెరిగారు.

Mansoor Ali Khan sensational comments on chiranjeevi
Mansoor Ali Khan

చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నాకు తెలీదు.. ఆయన కూడా పార్టీ పెట్టాడు.. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలీదు..ఆ డబ్బంతా వాళ్ల కోసమే వాడుకుంటున్నారు.. ప్రజల కష్టాలను తీర్చడం లేదు అని మ‌న్సూర్ అన్నాడు. చిరంజీవి గారి మీద రూ. 20 కోట్లు, త్రిష, కుష్బూ గార్ల మీద పది కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసిన తాను ఆ డ‌బ్బు వ‌చ్చాక వాటితో పేద‌ల‌కి సేవ చేస్తానంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం మ‌న్సూర్ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.