Manchu Vishnu : ప‌వ‌న్‌, త‌న మ‌ధ్య ఏం జ‌రిగిందో వీడియో ద్వారా చూపించిన మంచు విష్ణు..!

October 19, 2021 5:59 PM

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత సినిమా రంగానికి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ధ్య దూరం పెరిగింది. అది ప‌లు సంద‌ర్భాల‌లో స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-మంచు విష్ణుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం నడుస్తోంది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ముభావంగా ఉండటం, మంచు విష్ణును అస్సలు పట్టించుకోకుండా ఉండటం నెట్టింట్లో తెగ వైరల్ కావ‌డంతో అభిమానుల‌లో అనేక అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.

Manchu Vishnu told what really happened between him and pawan explained with video

తిరుప‌తిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మంచు విష్ణు.. అలయ్ బలయ్ కార్యక్రమంలో స్టేజ్ కింద పవన్ కళ్యాణ్ తో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని అన్నారు. అంతే కాకుండా ఆయనేమీ చిన్న స్టార్ కాదు.. చాలా పెద్దస్టార్.. ఆయన సహాయ సహకారాలు కూడా మాకు కావాలని మంచు విష్ణు అన్నారు. ఇక అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్.. ఇది మన తల్లి.. జాగ్రత్తగా చూసుకో అని.. అన్నారంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

విష్ణు క్లారిటీ ఇచ్చినా కూడా మంచు, మెగా ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతోందని సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ పుకార్లకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు మంచు విష్ణు. ‘అసలు జరిగిన విషయం ఇదే’నంటూ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో.. స్టేజ్‌ ఎక్కేముందు విష్ణు, పవన్‌లు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న సన్నివేశాలు ఉన్నాయి. ఇద్దరూ హ‌గ్ ఇచ్చుకున్నారు. కొద్ది సేపు సంభాషించుకున్నారు. మ‌రి ఈ వీడియోతో అయినా పుకార్లకు చెక్ ప‌డుతుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now