Manchu Vishnu : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గత కొంత కాలంగా వివాదాలు నెలకొన్న విషయం విదితమే. అయితే మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ఇదే విషయమై ఏపీ సీఎం జగన్‌ను కలిసి చర్చించారు. ఇక తాజాగా మరోమారు ఆయన ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్స్‌తో కలిసి సీఎం జగన్‌ను కలిసి మళ్లీ ఆయా సమస్యలపై చర్చించారు. దీంతో టాలీవుడ్ సమస్యలకు శుభం కార్డు పడినట్లేనని భావిస్తున్నారు.
అయితే టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్‌ను కలిసిన ఒక రోజు తరువాత ఏపీ మంత్రి పేర్ని నాని మోహన్‌బాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోహన్ బాబు వైసీపీ నేత. అందులో భాగంగానే ఆయనను కలిశారని అనుకోవడానికి లేదు. పైగా ఆ సమావేశంలో మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. దీంతో ఆ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే సమావేశం అనంతరం విష్ణు టాలీవుడ్ సమస్యలపై ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని తమతో చర్చించారని.. ఈ విషయంలో సంతృప్తిగా ఉందని చెబుతూ ట్వీట్ చేశారు. అయితే నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఆయన వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి ఊరికే థ్యాంక్స్ చెప్పారు. దీంతో విష్ణుకు నెటిజన్ల నుంచి మరిన్ని విమర్శలు ఎదురవుతున్నాయి.
సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ మొత్తం ఒక మాట మీద నిలబడాలని చెప్పిన మోహన్ బాబు, విష్ణు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అలాగే చిరంజీవి జగన్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు మంచు ఫ్యామిలీ కూడా వెళ్లి ఉండవచ్చు కదా.. అందుకు వారికి కలిగిన నొప్పి ఏమిటో చెప్పాలి.. అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే ముందుగా మోహన్ బాబే ఈ సమస్యను పరిష్కరించి ఇండస్ట్రీకి పెద్ద అయి ఉండవచ్చు కదా.. అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు చేస్తున్న విమర్శలకు మంచు ఫ్యామిలీ వద్ద సమాధానం లేదని స్పష్టమవుతోంది. చిరంజీవి కన్నా తామే ముందుగా స్పందించి జగన్‌తో చర్చించి ఉంటే తమకే క్రెడిట్ అంతా దక్కేది కదా.. అన్న భావనలో మంచు ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ఇంకా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…