Manchu Manoj : సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు అండర్ స్టాండింగ్‌తో దశాబ్ధాల పాటు కలిసుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015 లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
మోహన్ బాబు రేంజ్ కి తగ్గట్టు వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వీరు పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నారు మనోజ్. ఈయన పెళ్లికి సంబంధించి కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన స్పందించడం లేదు. తాజాగా మనోజ్ ఒక విదేశీ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మనోజ్.. పలు సినిమాలలో బాగానే నటించాడు. ఆ తర్వాత దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న మనోజ్ కొద్ది రోజుల క్రితం తన సొంత బ్యానర్ లో అహం బ్రహ్మాస్మి అనే సినిమాను కూడా ప్రారంభించగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా విడుదల చేశారు. కానీ మళ్లీ ఈ సినిమా గురించి మళ్లీ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఇంతవరకు రాలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…