Manchu Manoj : మంచు మ‌నోజ్ సెకండ్ మ్యారేజ్..?

October 25, 2021 3:04 PM

Manchu Manoj : సినిమా ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు అండర్‌ స్టాండింగ్‌తో ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు. కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్ తనదైన శైలిలో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015 లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

Manchu Manoj may soon tie not to a foreign girl

మోహన్ బాబు రేంజ్ కి తగ్గట్టు వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వీరు పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నారు మ‌నోజ్. ఈయ‌న పెళ్లికి సంబంధించి కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఆయ‌న స్పందించ‌డం లేదు. తాజాగా మనోజ్ ఒక విదేశీ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మనోజ్.. పలు సినిమాలలో బాగానే నటించాడు. ఆ తర్వాత దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మ‌ధ్య‌లో కొంత గ్యాప్ తీసుకున్న మ‌నోజ్ కొద్ది రోజుల క్రితం తన సొంత బ్యానర్ లో అహం బ్రహ్మాస్మి అనే సినిమాను కూడా ప్రారంభించగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా విడుదల చేశారు. కానీ మళ్లీ ఈ సినిమా గురించి మళ్లీ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఇంతవరకు రాలేదు. మ‌రి ఈ సినిమా ఎప్పుడు ఉంటుంద‌నేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now