Manchu Lakshmi : మంచు ఫ్యామిలీపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం విదితమే. వారు సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెడుతున్నా సరే.. నెటిజన్లు మాత్రం వారిని దారుణంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు తమ చేతులకు పని కల్పించారు. ఆమె పెట్టిన పోస్టు వల్ల మరోమారు ఆమెపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. ఆమెను నెటిజన్లు దారుణంగా విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఆమె ఏం పోస్ట్ చేసిందంటే..
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు ఓ యూట్యూబ్ చానల్ ఉంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అధిక సంఖ్యలో ఆమెకు ఫాలోవర్లు కూడా ఉన్నారు. దీంతో ఆయా సామాజిక మాధ్యమాల్లో ఆమె తరచూ పోస్టులు పెడుతుంటుంది. ఇక తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దానికి కాప్షన్ కూడా ఇచ్చింది.
మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ చెప్పుల ర్యాక్ తో కూడిన ఫొటోను షేర్ చేసింది. ఆ ర్యాక్ ఎదుట ఆమె కూర్చుని ముందట ఓ ఐదు జతల షూస్‌ను పెట్టుకుంది. వాటిల్లో ఏవి ధరించాలో తెలియడం లేదని.. ఎప్పుడూ సరైన షో దొరకదని.. ఆమె కాప్షన్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమె పోస్టుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె పోస్టుకు మద్దతు తెలుపుతుండగా.. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
నీకు అన్ని జతల షూస్, చెప్పులు ఉంటే అవి లేని వారికి ఇవ్వొచ్చు కదా.. షో చేయడం ఎందుకు.. నువ్వు చెప్పుల షాపు ఏమైనా పెట్టావా.. చెప్పులను, షూస్‌ను స్మగ్లింగ్ చేస్తున్నావా.. అంటూ మంచు లక్ష్మిని విమర్శిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మళయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ మూవీలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అందుకు గాను ఆమె ఇటీవల పలు విద్యల్లోనూ శిక్షణ తీసుకుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…