Manchu Lakshmi : మంచు లక్ష్మి మళ్లీ దొరికిపోయింది.. దారుణంగా విమర్శల పాలవుతోందిగా..!

May 29, 2022 7:53 PM

Manchu Lakshmi : మంచు ఫ్యామిలీపై ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌, విమర్శలు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం విదితమే. వారు సోషల్‌ మీడియాలో ఏ పోస్టులు పెడుతున్నా సరే.. నెటిజన్లు మాత్రం వారిని దారుణంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టింది. దీంతో నెటిజన్లు తమ చేతులకు పని కల్పించారు. ఆమె పెట్టిన పోస్టు వల్ల మరోమారు ఆమెపై తెగ ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆమెను నెటిజన్లు దారుణంగా విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఆమె ఏం పోస్ట్‌ చేసిందంటే..

మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు ఓ యూట్యూబ్‌ చానల్‌ ఉంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అధిక సంఖ్యలో ఆమెకు ఫాలోవర్లు కూడా ఉన్నారు. దీంతో ఆయా సామాజిక మాధ్యమాల్లో ఆమె తరచూ పోస్టులు పెడుతుంటుంది. ఇక తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. దానికి కాప్షన్‌ కూడా ఇచ్చింది.

Manchu Lakshmi shared her shoes post netizen troll her
Manchu Lakshmi

మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ చెప్పుల ర్యాక్ తో కూడిన ఫొటోను షేర్‌ చేసింది. ఆ ర్యాక్‌ ఎదుట ఆమె కూర్చుని ముందట ఓ ఐదు జతల షూస్‌ను పెట్టుకుంది. వాటిల్లో ఏవి ధరించాలో తెలియడం లేదని.. ఎప్పుడూ సరైన షో దొరకదని.. ఆమె కాప్షన్‌ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమె పోస్టుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె పోస్టుకు మద్దతు తెలుపుతుండగా.. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.

నీకు అన్ని జతల షూస్‌, చెప్పులు ఉంటే అవి లేని వారికి ఇవ్వొచ్చు కదా.. షో చేయడం ఎందుకు.. నువ్వు చెప్పుల షాపు ఏమైనా పెట్టావా.. చెప్పులను, షూస్‌ను స్మగ్లింగ్‌ చేస్తున్నావా.. అంటూ మంచు లక్ష్మిని విమర్శిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మళయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ మూవీలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తోంది. అందుకు గాను ఆమె ఇటీవల పలు విద్యల్లోనూ శిక్షణ తీసుకుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్‌ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now