కలెక్షన్ కింగ్ వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు లక్ష్మి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోస్, కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లో యాంకర్ గా కూడా అలరించారు మంచు లక్ష్మి. అయితే సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు సాధించలేదు మంచు వారసురాలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటారు. అయితే మంచు లక్ష్మి పెట్టిన అనేక పోస్ట్స్ వైరల్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతుంటాయి.
మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కానీ మంచు లక్ష్మి ఎక్కువగా పోస్టులు చేయడం వల్ల ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతారు. ఇది ఇలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మి తనకు తెలుగు చదవడం, రాయడం రాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు రాదు అనడంతో నెటిజన్లు లక్ష్మిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నటీమణులు కూడా తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకుంటున్నారు. ఈమె మాత్రం తెలుగు గడ్డపై పుట్టి అమెరికాలో పెరిగినంత మాత్రాన తెలుగు రాకపోవడం ఏంటీ.. అని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా మంచి లక్ష్మి నిజం చెప్పి అడ్డంగా బుక్ అయింది.
ఇటీవల మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ను ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో ఆమెను నెటిజన్లు అభినందించారు. కానీ తాజాగా తెలుగు రాదనడంతో మళ్లీ వారు ట్రోల్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…