Sonu Sood : వెండితెరపై విలనిజం ప్రదర్శించిన సోనూసూద్ రియల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోవిడ్ పరిస్థితుల్లో సామాన్యులకు, మధ్య తరగతి వారికి సేవలు అందించి అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న వ్యక్తి సోనూసూద్. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు కూడా దేవుడుగా మారారు. ఆయన చారిటీ సాయంతో క్షేమంగా భారత్‌కు తరలించారు. వారంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా బాలీవుడ్ నటుడు సోనూసూద్ సేవలు ఉక్రెయిన్‌కు కూడా చేరుకున్నాయి.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు అడిగిన వారికి లేదు.. కాదు.. అనకుండా సహాయం చేస్తున్నారు సోనుసూద్. అయితే కొందరు నెటిజన్స్ ఆయనతో చమత్కారాలు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ చలికాలంలో దుప్పట్లు పంచారు.. అదేవిధంగా వేసవి కాలంలో చల్లని బీరు కూడా పంపిణీ చేస్తే బాగుంటుందన్నాడు. ఈ పోస్ట్ ని ఉద్దేశిస్తూ సోనూసూద్ బీర్ తోపాటుగా స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది.. అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఇక కొద్ది రోజులుగా సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన స్పందించారు. సమాజసేవ అనేది తమ రక్తంలోనే ఉందని, తన తల్లి ఒక ప్రొఫెసర్ అని, పిల్లలకు తన జీవిత పాఠాలన్నీ నేర్పారని అన్నారు. అదేవిధంగా తన తండ్రి ఒక సామాజిక కార్యకర్త అని, మోగాలో చాలా పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలను తన కుటుంబం నిర్మించిందని అన్నారు. ఇప్పుడు తన సోదరి కూడా తన తల్లిదండ్రుల అనుసరిస్తోందని, పంజాబ్‌లోని మోగా సిటీలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని సోనూసూద్ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని సోనూసూద్ ప్రకటించారు. తన సామాజిక కార్యక్రమాలను, ఎన్నికలు రెండింటినీ నిర్వహించడానికి తనకు తగినంత పెద్ద టీమ్ లేదని అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…