Pragya Jaiswal : కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. చూడ చక్కని, ఆకర్షించే అభినయం ఉన్నా కూడా ఈ అమ్మడికి సరైన ఆఫర్స్ రావడం లేదు. ఇటీవల ప్రగ్యా జైశ్వాల్.. బాలయ్య అఖండలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి హిట్ కాగా ప్రగ్యాకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత అయినా ప్రగ్యాకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరూ భావించారు. కానీ ఈ అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయి. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులు కోవడానికి సిద్ధపడడం లేదు.
ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. విస్కీ.. దాంతోపాటు ఓ గ్లాస్‌ను చేతబట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగ్యా జైశ్వాల్ ఓ వీస్కీ కంపెనీని ప్రమోట్ చేస్తోంది. అందుకే ఆ బ్రాండ్‌కు చెందిన వీస్కీని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలా ఓ వైపు సినిమాలతోపాటు ఇలా పెయిడ్ యాడ్స్‌తో రెండు చేతులా ఆర్జిస్తోంది. అయితే జిమ్ బీమ్ అనే విస్కీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ అమ్మడు ఓ హాట్ ఫోజ్ లో కనిపించింది.
విస్కీ బాటిల్ ని హైలైట్ చేసిన ప్రగ్యా.. బ్లాక్ అండ్ వైట్ లో కనిపించింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ మత్తు ఎక్కించే రెండూ పక్క పక్కన ఉంటే ఒకటే హైలైట్ అవుతుందని చెప్పలేం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు డబ్బుల కోసం ఇంతగా దిగజారుతావా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ప్రగ్యా ఒక టాప్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…