Mallidi Vashist : మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసార ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. చాలాకాలం తర్వాత కళ్యాణ్ రామ్‌కి ఈ చిత్రం కమర్షియల్ హిట్ ను ఇచ్చింది. అయితే బింబిసార మూవీ ద్వారా కళ్యాణ్ రామ్ కు హీరోగా ఎంత గుర్తింపు వచ్చిందో, డైరెక్టర్ వశిష్టకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బింబిసార హిట్ తర్వాత టాలీవుడ్ లో డైరెక్టర్ విశిష్ట రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ఎన్నో ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.
అయినా కూడా దర్శకుడిగా అవకాశం దక్కని వాళ్ళు కృష్ణానగర్ లో చాలామందే ఉన్నారు. ఇక దర్శకుడిగా అవకాశం వచ్చి భారీ హిట్ అందుకుంటే మాత్రం హీరోలు, నిర్మాతలు ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమైపోతారు. ఇప్పుడు మల్లిడి వశిష్టతో సినిమా తీసేందుకు చాలా మంది మేకర్స్ ట్రై చేస్తున్నారట. దర్శకధీరుడు రాజమౌళి రేంజ్‌లో బింబిసార చిత్రాన్ని రూపొందించి ఇండస్ట్రీలో సినిమా ప్రముఖులతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు వశిష్ట. ఇప్పటికే వేరే నిర్మాతలు ఆయనకి అడ్వాన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే వశిష్ట దృష్టి మాత్రం బింబిసార సీక్వెల్ మీదే ఉందట. పార్ట్ 1 కోసం జీతం తరహాలోనే నెలకు రూ.2 లక్షలు అందుకున్నారట. ఇదే తన రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. బింబిసార భారీ కమర్షియల్ హిట్ కాబట్టి లాభాలలో కొంత వాటా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బింబిసార సీక్వెల్ మూవీ కోసం కళ్యాణ్ రామ్ వశిష్టకి రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క హిట్‌తో వశిష్ట రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉండగా బింబిసార సీక్వెల్ మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడుస్తుందో తెలీదు గానీ బింబిసార పార్ట్ 2 ఇంతకు మించి ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…