Mallidi Vashist : బింబిసార డైరెక్టర్ వ‌శిష్ట రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

September 5, 2022 9:44 PM

Mallidi Vashist : మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసార ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. చాలాకాలం తర్వాత కళ్యాణ్ రామ్‌కి ఈ చిత్రం కమర్షియల్ హిట్ ను ఇచ్చింది. అయితే బింబిసార మూవీ ద్వారా కళ్యాణ్ రామ్ కు హీరోగా ఎంత గుర్తింపు వచ్చిందో, డైరెక్టర్ వశిష్టకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బింబిసార హిట్ తర్వాత టాలీవుడ్ లో డైరెక్టర్ విశిష్ట రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ఎన్నో ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

అయినా కూడా దర్శకుడిగా అవకాశం దక్కని వాళ్ళు కృష్ణానగర్ లో చాలామందే ఉన్నారు. ఇక దర్శకుడిగా అవకాశం వచ్చి భారీ హిట్ అందుకుంటే మాత్రం హీరోలు, నిర్మాతలు ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమైపోతారు. ఇప్పుడు మల్లిడి వశిష్టతో సినిమా తీసేందుకు చాలా మంది మేకర్స్ ట్రై చేస్తున్నారట. దర్శకధీరుడు రాజమౌళి రేంజ్‌లో బింబిసార చిత్రాన్ని రూపొందించి ఇండస్ట్రీలో సినిమా ప్రముఖులతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు వశిష్ట. ఇప్పటికే వేరే నిర్మాతలు ఆయనకి అడ్వాన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

Mallidi Vashist bimbisara movie director remuneration
Mallidi Vashist

అయితే వశిష్ట దృష్టి మాత్రం బింబిసార సీక్వెల్ మీదే ఉందట. పార్ట్ 1 కోసం జీతం తరహాలోనే నెలకు రూ.2 లక్షలు అందుకున్నారట. ఇదే తన రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. బింబిసార భారీ కమర్షియల్ హిట్ కాబట్టి లాభాలలో కొంత వాటా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బింబిసార సీక్వెల్ మూవీ కోసం కళ్యాణ్ రామ్ వశిష్టకి రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క హిట్‌తో వశిష్ట రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉండగా బింబిసార సీక్వెల్ మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడుస్తుందో తెలీదు గానీ బింబిసార పార్ట్ 2 ఇంతకు మించి ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now