Malavika : ఆ సినిమాలో ఆ ఒక్క సీన్‌ చేయడం నచ్చలేదు.. సంచలన విషయాలను బయట పెట్టిన మాళవిక..

February 1, 2022 10:41 PM

Malavika : చాలా బాగుంది అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది మాళవిక. తరువాత దీవించండి, శుభకార్యం, అప్పారావు డ్రైవింగ్‌ స్కూల్‌ వంటి సినిమాల్లో నటించింది. రజనీకాంత్‌ మూవీ చంద్రముఖిలోనూ ఈమె కనిపించి అలరించింది. ఇక మాళవిక అసలు పేరు శ్వేతా కొన్నూర్‌ మేనన్‌. ఈ క్రమంలోనే మాళవిక తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పలు విశేషాలను పంచుకుంది.

Malavika says she did not like doing that scene in that movie
Malavika

తాను నటించిన తొలి తెలుగు చిత్రంలో అత్యాచారం సన్నివేశం ఉంటుందని.. ఆ సీన్‌లో నటించడం తనకు మంచిగా అనిపించలేదని.. కానీ ఓవరాల్‌గా ఆ సినిమాలో నటించడం సంతృప్తినిచ్చిందని మాళవిక సంచలన విషయాన్ని బయట పెట్టింది. అప్పట్లో సీయు ఎట్‌ 9 అనే హిందీ సినిమాలో గ్లామర్‌ షో చేశానని.. ఈ విషయంపై ఇంట్లో రచ్చ జరిగిందని, తన కుటుంబ సభ్యులు కోప్పడ్డారని ఆమె తెలిపింది.

Malavika : బన్‌, సమోసా అంటే ఇష్టమని..

తెలుగులో 5, తమిళంలో 35 చిత్రాలు చేసిన మాళవిక బన్‌, సమోసా అంటే ఇష్టమని చెప్పింది. కాలేజీ చదివే రోజుల్లో వాటిని తినేందుకు క్లాసులను ఎగ్గొట్టేదాన్నని గుర్తు చేసుకుంది. తనకు అప్పట్లో నాగార్జున అంటే ఇష్టం ఉండేదని, ఇప్పుడు విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టమని తెలియజేసింది. నటులు రజనీకాంత్‌, రాజేంద్ర ప్రసాద్‌, శ్రీకాంత్‌లతో సినిమాల్లో చేసినప్పుడు తాను ఎలా ఫీలైందో వివరించింది.

ఇటీవల వచ్చిన పుష్ప సినిమా చూశానని.. చాలా బాగుందని.. అయితే అందులో సమంత చేసిన ఐటమ్‌ సాంగ్‌ అవకాశం తనకు వచ్చినా.. అంగీకరించేదాన్నని స్పష్టం చేసింది.

తమిళంలో ఉన్నై థేడి అనే సినిమాతో మాళవిక సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించగా.. ఈమె తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లోనూ నటించింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుందితో ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment