Mahesh Babu : 30 మంది చిన్నారుల జీవితాల్లో.. వెలుగులు నింపిన మ‌హేష్ బాబు.. హ్యాట్సాఫ్‌..!

April 9, 2022 6:42 PM

Mahesh Babu : సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటూ స్టార్ హీరోగా మారాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ఆయ‌న రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరోనే. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని ఈ స్టార్ హీరో చేసే మంచి పనుల గురించి అందరికీ తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

Mahesh Babu saved 30 children from heart diseases
Mahesh Babu

మహేష్ బాబు ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్ కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాల గురించి నమ్రత ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. ఏప్రిల్ 7న‌ నమ్రత ఓ పోస్ట్ చేశారు. అందులో 30 మంది చిన్నారులకు ఒకే రోజు ఆపరేషన్ చేసినట్టుగా తెలిపారు. అంటే ఒకే రోజు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా 30 మంది చిన్నారులకు ఊపిరి అందిందన్నమాట. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌, మహేష్ బాబు ఫౌండేషన్‌ వైద్యుల సహకారంతో చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు.

మంచి పనికి సపోర్ట్ ను అందించినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు ధన్యవాదాలు తెలిపారు న‌మ్ర‌త‌. ఒక‌వైపు చిన్నారుల జీవితాల‌లో వెలుగు నింపుతున్న‌ మ‌హేష్ మ‌రో వైపు తన సొంతూరు బుర్రిపాలెంలోనూ డిజిటల్ లెర్నింగ్‌ను మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ప్రారంభించారు. ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మ‌హేష్ చేస్తున్న సేవా కార్య‌క్రమాల పట్ల ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment