Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం నటించేందుకు సిద్ధం అవుతున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పనులు మొదలు కాబోతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అతడు, ఖలేజా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది.
ప్రస్తుతం మహేష్ ఈ చిత్రం కోసం సరికొత్త లుక్ లో దర్శనమిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని క్లాస్ లుక్ లో చూపించబోతున్నాడా.. లేక మాస్ లుక్ లో చూపించబోతున్నాడా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.
మహేష్ ముద్దుల తనయ చిన్నారి సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ డాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా మహేష్ బాబు తన ముద్దుల కుమార్తె సితారతో కలసి ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే డాన్స్ ఇండియా డాన్స్ షోకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదలయ్యింది. తండ్రితో కలసి సితార చేసే సందడిని చూసి ఫ్యాన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. డాన్స్ అంటే ఒక సెలెబ్రేషన్స్ అని మహేష్ బాబు చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఫోటోలో మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా కండలతో కనిపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే చిత్రం కోసం మహేష్ బాడీ బిల్డ్ చేస్తున్నట్లు కూడా ఒక ప్రచారం ఉంది. మహేష్ ఫ్యాన్స్ కోసం త్రివిక్రమ్ అల్టిమేట్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారనేది పక్కాగా చెప్పవచ్చు. తొలిసారి మహేష్ బాబు ఈ విధంగా మీసాలు, గడ్డం పెంచుతున్నట్లు అర్థం అవుతోంది. మహేష్ బాబు ఆన్ స్క్రీన్ పై ఎప్పుడూ పెద్ద మీసాలు, గడ్డం, షర్ట్ లేకుండా దర్శనం ఇవ్వలేదు. ఇక ఈ లుక్ మాత్రం మహేష్ బాబు అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. కాగా మహేష్ బాబు తన కూతురుతో కనిపించిన ఈ లుక్ మాత్రం వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…