Prabhas Raja Delux Movie Story : పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు. ఎప్పుడూ ఒకే విధమైన సినిమాలు చేస్తుంటే తన ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుందని.. అందుకే తను చేసే సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ఇటీవల ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ అవ్వడంతో రాబోయే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మారుతితో చేస్తున్న సినిమా విషయంలో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. దానికి కారణం మారుతికి వరుస ఫ్లాప్ లు ఉండడం, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని మారుతి హ్యాండిల్ చేయలేడని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇప్పటికే వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతితో చేస్తున్న చిత్రానికి కూడా ముహూర్తం ఖరారు చేశాడు. వీలైనంత త్వరగా రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి. ప్రభాస్, మారుతికాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే రాజా డీలక్స్ అనే టైటిల్ ఖారరయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇది ఒక తాత, మనవడి కథ అని, రాజా డీలక్స్ అంటే తాత స్థాపించిన థియేటర్ పేరు అని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఆ థియేటర్ కోసం ఎలా పోరాడాడు ? ఆ థియేటర్ ని ఎవరు తీసుకున్నారు ? అనే విషయం చుట్టూ కథ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఫిల్మ్ సిటీలో రాజా డీలక్స్ సెట్ రెడీ అయ్యిందట. అంతే కాకుండా ఇందులో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని కొందరు అంటున్నారు. ఈ మూవీలో రాశీ ఖన్నా, మాళవికా మోహనన్, శ్రీలీల హీరోయిన్లుగా ఫిక్స్ అయినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక మారుతి చివరిగా తెరకెక్కించిన ప్రతిరోజు పండగే చిత్రం కూడా తాత, మనవడి కథాంశంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ కలసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు, తమిళ్, కన్నడ, మళయాళం భాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…