Prabhas Raja Delux Movie Story : ప్రభాస్ రాజా డీలక్స్ మూవీ క‌థ లీక్‌.. కథేంటంటే..?

August 30, 2022 8:06 PM

Prabhas Raja Delux Movie Story : పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు. ఎప్పుడూ ఒకే విధమైన సినిమాలు చేస్తుంటే తన ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుందని.. అందుకే తను చేసే సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ఇటీవల ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ అవ్వడంతో రాబోయే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మారుతితో చేస్తున్న సినిమా విషయంలో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. దానికి కారణం మారుతికి వరుస ఫ్లాప్ లు ఉండడం, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని మారుతి హ్యాండిల్ చేయలేడని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పటికే వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతితో చేస్తున్న చిత్రానికి కూడా ముహూర్తం ఖరారు చేశాడు. వీలైనంత త్వరగా రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి. ప్రభాస్, మారుతికాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే రాజా డీలక్స్ అనే టైటిల్ ఖారరయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇది ఒక తాత, మనవడి కథ అని, రాజా డీలక్స్ అంటే తాత స్థాపించిన థియేటర్ పేరు అని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఆ థియేటర్ కోసం ఎలా పోరాడాడు ? ఆ థియేటర్ ని ఎవరు తీసుకున్నారు ? అనే విషయం చుట్టూ కథ నడుస్తుంద‌ని వార్తలు వస్తున్నాయి.

Prabhas Raja Delux Movie Story leaked online
Prabhas Raja Delux Movie Story

ఇప్పటికే ఫిల్మ్ సిటీలో రాజా డీలక్స్ సెట్ రెడీ అయ్యిందట. అంతే కాకుండా ఇందులో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని కొందరు అంటున్నారు. ఈ మూవీలో రాశీ ఖన్నా, మాళవికా మోహనన్, శ్రీలీల‌ హీరోయిన్లుగా ఫిక్స్ అయినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక మారుతి చివరిగా తెరకెక్కించిన ప్రతిరోజు పండగే చిత్రం కూడా తాత, మనవడి కథాంశంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ కల‌సి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు, తమిళ్, కన్నడ, మళ‌యాళం భాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment