Puri Jagannadh : పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన మూవీ లైగర్. మొదటి రోజు కలెక్షన్స్ ఫర్వాలేదు అనిపించినా డిజాస్టర్ టాక్ తో రెండో రోజే లైగర్ వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. కొన్నిచోట్ల ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే లైగర్ డామేజ్ గట్టిగానే జరిగిందని అర్దమవుతోంది. ఇప్పుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు పూరీని కలిసే ఆలోచనలో ఉన్నట్టు ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.
చాలా ఏరియాల్లో ఈ సినిమాని అడ్వాన్స్ బేసిస్ మీద అమ్మారు. థియేటర్ బిజినెస్ డీల్ మొత్తం పూరీ జగన్నాథ్ చూసుకున్నారు. దాంతో రిలీజ్ కు ముందు సినిమాకు లాభాలు వచ్చాయి. దిల్ రాజు వైజాగ్ ఏరియాని నాలుగు కోట్లు పెట్టి తీసుకున్నట్టు సమాచారం. దీంతో దిల్ రాజు, ఎన్‌వి ప్రసాద్ కలిసి పూరీని మీట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే తమ నష్టాలు కాంపన్సేట్ చేయటానికి డిస్ట్రిబ్యూటర్స్.. పూరీని కలవబోతున్నారట. ఫైనాన్సియర్ చదలవాడ శ్రీనివాస రావు, శోభన్ తో కలిసి ఆంధ్ర థియేటర్ బిజినెస్ చేశారు. వరంగల్ శ్రీను నైజాం రైట్స్ తీసుకున్నారు. వీరంతా పూరీతో టచ్ లో ఉండి నష్టాల గురించి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
పూరీ తన సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను తీరుస్తానని మాట ఇచ్చారంటున్నారు. ఈ వారంలోనే దీని గురించి మీటింగ్ జరగనుంది. ఇటీవల ఆచార్య తలనొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కొరటాల శివ కోలుకుంటున్నారు. ఇప్పుడు పూరీ కూడా అదే సమస్యలో ఇరుక్కోవటం హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహార్ పూరీ మీద కోపంగా ఉన్నారట. ఆయన ఇకపై ఏమాత్రం ఆదుకునే పరిస్థితి లేదని హిందీ సినీ వర్గాల నుంచి వినబడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కులను రూ.67 కోట్లకు వరంగల్ శ్రీను దక్కించుకున్నట్లు సమాచారం. ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ.85 నుండి రూ.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే కనీసం రూ.120 కోట్ల వరకు రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే లైగర్ తో వంద కోట్ల నష్టం జరగవచ్చు. లైగర్ రిజల్ట్ తర్వాత నిర్మాత ఛార్మి మొదటిసారి మాట్లాడారు. సినిమా ఫెయిల్యూర్ కావడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో కష్టాలు పడి సినిమా విడుదల చేస్తే ఫలితం నిరాశపరిచిందని ఆమె అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…