Puri Jagannadh : డిజాస్టర్ అవ్వడంతో పూర్తిగా నష్టపోయాం.. డబ్బులివ్వండి.. పూరీకి మొదలైన లైగర్ సెగ..

August 30, 2022 6:54 PM

Puri Jagannadh : పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన మూవీ లైగర్. మొదటి రోజు కలెక్షన్స్ ఫర్వాలేదు అనిపించినా డిజాస్టర్ టాక్ తో రెండో రోజే లైగర్ వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. కొన్నిచోట్ల ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే లైగర్ డామేజ్ గట్టిగానే జరిగిందని అర్దమవుతోంది. ఇప్పుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు పూరీని కలిసే ఆలోచనలో ఉన్నట్టు ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.

చాలా ఏరియాల్లో ఈ సినిమాని అడ్వాన్స్ బేసిస్ మీద అమ్మారు. థియేటర్ బిజినెస్ డీల్ మొత్తం పూరీ జగన్నాథ్ చూసుకున్నారు. దాంతో రిలీజ్ కు ముందు సినిమాకు లాభాలు వచ్చాయి. దిల్ రాజు వైజాగ్ ఏరియాని నాలుగు కోట్లు పెట్టి తీసుకున్నట్టు సమాచారం. దీంతో దిల్ రాజు, ఎన్‌వి ప్రసాద్ కలిసి పూరీని మీట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే తమ నష్టాలు కాంపన్సేట్ చేయటానికి డిస్ట్రిబ్యూటర్స్.. పూరీని కలవబోతున్నారట. ఫైనాన్సియర్ చదలవాడ శ్రీనివాస రావు, శోభన్ తో కలిసి ఆంధ్ర థియేటర్ బిజినెస్ చేశారు. వరంగల్ శ్రీను నైజాం రైట్స్ తీసుకున్నారు. వీరంతా పూరీతో టచ్ లో ఉండి నష్టాల గురించి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

liger movie distributors demand money from Puri Jagannadh
Puri Jagannadh

పూరీ తన సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను తీరుస్తానని మాట ఇచ్చారంటున్నారు. ఈ వారంలోనే దీని గురించి మీటింగ్ జరగనుంది. ఇటీవల ఆచార్య తలనొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కొరటాల శివ కోలుకుంటున్నారు. ఇప్పుడు పూరీ కూడా అదే సమస్యలో ఇరుక్కోవటం హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహార్ పూరీ మీద కోపంగా ఉన్నారట. ఆయన ఇకపై ఏమాత్రం ఆదుకునే పరిస్థితి లేదని హిందీ సినీ వర్గాల నుంచి వినబ‌డుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర హక్కులను రూ.67 కోట్లకు వరంగల్ శ్రీను దక్కించుకున్నట్లు సమాచారం. ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ.85 నుండి రూ.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే కనీసం రూ.120 కోట్ల వరకు రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే లైగర్ తో వంద కోట్ల నష్టం జరగవచ్చు. లైగర్ రిజల్ట్ తర్వాత నిర్మాత ఛార్మి మొదటిసారి మాట్లాడారు. సినిమా ఫెయిల్యూర్ కావడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో కష్టాలు పడి సినిమా విడుదల చేస్తే ఫలితం నిరాశపరిచిందని ఆమె అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now