Mahesh Babu : మ‌హేష్ బాబు 3 రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాడా ? ఎందుకు ?

February 5, 2022 1:35 PM

Mahesh Babu : సాధార‌ణంగా హీరోలు త‌మ సినిమాలు హిట్ అయితే ఓకే. లేదంటే కొన్ని రోజుల పాటు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా వెకేష‌న్స్‌కు వెళ్తుంటారు. ఇక కొంద‌రు తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోతారు. ఇలా హీరోలు త‌మ సినిమాలు ఫ్లాప్ అయితే భిన్న ర‌కాలుగా ప్ర‌వ‌ర్తిస్తారు. కానీ ఏ హీరోకు అయినా.. ఫ్లాప్‌, హిట్ అనేవి ముందుగా తెలియ‌వు. అది ల‌క్ మీద ఆధార ప‌డి ఉంటుంది. కొన్నిసార్లు ఎంత మంచి క‌థ‌తో సినిమా తీసినా న‌డ‌వ‌వు. అది అంతే. అయితే మ‌హేష్ బాబు త‌న సినిమాలు ఫ్లాప్ అయితే ఏం చేస్తారో చెప్పేశారు.

Mahesh Babu cried for 3 days know the reason
Mahesh Babu

సినిమా ఫ్లాప్ అనేది నాకు అత్యంత బాధాక‌ర‌మైన విష‌యం. నా సినిమా ఫ్లాప్ అయితే చాలా విచారిస్తాను. బాధ్య‌త మొత్తం నేనే తీసుకుంటాను. నా సినిమా ఫ్లాప్ అయింద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకుంటాను. అందుకు పూర్తి బాధ్య‌త నేనే వ‌హిస్తాను. 2-3 రోజుల పాటు నా గ‌ది నుంచి బ‌య‌టకు రాను. ఏడుస్తూనే ఉంటాను. చివ‌ర‌కు విచారం నుంచి బ‌య‌ట ప‌డ‌తాను.. అని మ‌హేష్ తెలిపారు.

బాల‌కృష్ణ‌తో తాజాగా చేసిన అన్ స్టాప‌బుల్ షో చివ‌రి ఎపిసోడ్‌కు మ‌హేష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పై విధంగా చెప్పారు. ఇక మ‌హేష్ త‌దుప‌రి చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఆ మూవీ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఇందులో పూజా హెగ్డె న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ మూవీని లాంచ్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment