Love Story : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇందులో నాగ చైతన్య మధ్యతరగతి అబ్బాయిగా రేవంత్ అనే పాత్రలో, సాయి పల్లవి మౌనిక అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పవచ్చు.
విడుదలైన మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.శేఖర్ కమ్ముల ఎప్పుడూ కొత్త వాళ్లతోనే సినిమా తీయాలనే ఆలోచన చేస్తారు. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ సినిమా కూడా కొత్త వాళ్లతో తీయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమాను మొదట మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు వినిపించారు.
కథ విన్న వైష్ణవ్ తేజ్ తాను అప్పుడే నటిస్తున్న ఇటువంటి ఉప్పెన సినిమా కథ కూడా ఇదే విధంగా ఉండటం చేత వైష్ణవ్ తేజ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కథ నాగచైతన్య దగ్గరకు వెళ్లి ప్రస్తుతం అద్భుతమైన విజయాన్ని నాగచైతన్యకు అందించింది.
కాగా లవ్ స్టోరీ సినిమాకు చెందిన ప్రమోషన్స్‌లోనూ సమంత పాల్గొనలేదు. దీంతో సమంత, నాగచైతన్యల మధ్య విడాకులు ఖాయం అయ్యాయనే వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అలాంటి రూమర్స్ ను నమ్మొద్దని సమంత చెప్పింది. మరలాంటప్పుడు ఎక్కడికి వెళ్లినా కలసి కనిపించే ఇద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు.. ఎందుకని.. ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…