Love Story : లవ్ స్టోరీ సినిమా మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ?

సెప్టెంబర్ 29, 2021 11:08 ఉద.

Love Story : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇందులో నాగ చైతన్య మధ్యతరగతి అబ్బాయిగా రేవంత్ అనే పాత్రలో, సాయి పల్లవి మౌనిక అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పవచ్చు.

Love Story : లవ్ స్టోరీ సినిమా మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ?
Love Story

విడుదలైన మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.శేఖర్ కమ్ముల ఎప్పుడూ కొత్త వాళ్లతోనే సినిమా తీయాలనే ఆలోచన చేస్తారు. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ సినిమా కూడా కొత్త వాళ్లతో తీయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమాను మొదట మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు వినిపించారు.

కథ విన్న వైష్ణవ్ తేజ్ తాను అప్పుడే నటిస్తున్న ఇటువంటి ఉప్పెన సినిమా కథ కూడా ఇదే విధంగా ఉండటం చేత వైష్ణవ్ తేజ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ కథ నాగచైతన్య దగ్గరకు వెళ్లి ప్రస్తుతం అద్భుతమైన విజయాన్ని నాగచైతన్యకు అందించింది.

కాగా లవ్‌ స్టోరీ సినిమాకు చెందిన ప్రమోషన్స్‌లోనూ సమంత పాల్గొనలేదు. దీంతో సమంత, నాగచైతన్యల మధ్య విడాకులు ఖాయం అయ్యాయనే వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అలాంటి రూమర్స్‌ ను నమ్మొద్దని సమంత చెప్పింది. మరలాంటప్పుడు ఎక్కడికి వెళ్లినా కలసి కనిపించే ఇద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు.. ఎందుకని.. ఫ్యాన్స్‌ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment