Liger Movie : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు.
కొద్ది రోజులుగా చిత్ర షూటింగ్‌కి బ్రేక్ తీసుకున్న విజయ్ దేవరకొండ యూఎస్ లో ప్రత్యక్షం అయ్యాడు. తన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి చిల్ అవుతున్నాడు. ఇద్దరూ కలిసి మందు తాగుతున్నట్టు తాజాగా చక్కర్లు కొడుతున్న పిక్స్ చూస్తుంటే తెలుస్తోంది. వారిద్దరూ ప్రస్తుతం అమెరికాలోని లాస్ వెగాస్ లో ఉన్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ ఇలా చిల్ అవుతున్నట్టుగా ఉంది. బ్యాలెన్స్ షూట్‌ను అక్కడే కంప్లీట్ చేయనున్న లైగర్ చిత్ర బృందం ఆ తర్వాత ఇండియాకి రానున్నారు.
ఇందులో లెజెండరీ మాజీ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లైగర్‌లో టైసన్ నటిస్తుండటంతో ఈ మూవీకి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. బాలకృష్ణ, అమితాబ్ బచ్చన్‌లతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని పూరీ భావిస్తున్నట్టు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…