Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్‌గా మారింది. బడా హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక.. తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. పెద్ద ఎత్తున ఈ అమ్మడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. వ్యక్తిగత విషయాలతోపాటు తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంటుంది. ఇటీవల ప్రముఖ డేటింగ్ యాప్ ఒకటి నిర్వహించిన ‘స్వైప్ రైడ్’ అనే టాక్ షోలో రష్మిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మీకంటే చిన్నవాడితో డేటింగ్ చేస్తారా.?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. ‘నా దృష్టిలో వయసు అనేది అసలు సమస్యే కాదు. ప్రేమకు వయస్సుతో సంబంధం ఏంటి.? వారు మమ్మల్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు అంతే.. అప్పుడు వయసు పెద్ద విషయం కాదు’ అని క్లారిటీగా చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో చొక్కా లేకుండా పోజులిచ్చే అబ్బాయిల గురించి మాట్లాడుతూ “కుర్రాళ్లు ఫిట్‌గా కన్పించడాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. మీరు ఎంత అంకితభావంతో ఉన్నారో అది చూపిస్తుంది. కానీ దీన్ని మీ ప్రొఫైల్ ఫోటోగా ఉంచాలని ఎందుకు కోరుకుంటున్నారు ? శరీరం కంటే ముందు మీరేంటో వాళ్లకు తెలియాలి కదా.. అని బదులిచ్చింది రష్మిక.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…