Liger Movie : మందు తాగుతూ పూరీ, విజయ్.. మస్త్ ఎంజాయ్ చేస్తున్నారుగా..!

November 13, 2021 11:01 PM

Liger Movie : యంగ్ సెన్సేష‌న్ విజయ్‌ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు.

Liger Movie vijay devarakonda puri jagannadh enjoying in las vegas

కొద్ది రోజులుగా చిత్ర షూటింగ్‌కి బ్రేక్ తీసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ యూఎస్ లో ప్ర‌త్య‌క్షం అయ్యాడు. త‌న డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి చిల్ అవుతున్నాడు. ఇద్ద‌రూ క‌లిసి మందు తాగుతున్న‌ట్టు తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న పిక్స్ చూస్తుంటే తెలుస్తోంది. వారిద్ద‌రూ ప్ర‌స్తుతం అమెరికాలోని లాస్ వెగాస్ లో ఉన్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు ఈ ఇద్ద‌రూ ఇలా చిల్ అవుతున్న‌ట్టుగా ఉంది. బ్యాలెన్స్ షూట్‌‌ను అక్కడే కంప్లీట్‌ చేయనున్న లైగ‌ర్ చిత్ర బృందం ఆ త‌ర్వాత ఇండియాకి రానున్నారు.

ఇందులో లెజెండరీ మాజీ బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. లైగర్‌లో టైసన్‌ నటిస్తుండటంతో ఈ మూవీకి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. బాల‌కృష్ణ‌, అమితాబ్ బచ్చ‌న్‌ల‌తో మైక్ టైస‌న్ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పించాల‌ని పూరీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now