Krithi Shetty : ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతిశెట్టి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీతో కృతిశెట్టికి మంచి ఫేమ్ వచ్చింది. యంగ్ కాలేజ్ గర్ల్ గా కృతి కుర్ర మనసుల్ని దోచేసింది. ఉప్పెన విజయంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. అయితే ఇప్పుడు కృతికి తిరోగమనం మొదలైనట్లు అనిపిస్తుంది. కృతి నటించిన ది వారియర్ మూవీ ప్లాప్ అయ్యింది.
అలాగే మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ద్వారా థియేటర్స్‌లో సందడి చేసింది. ఈ నేపథ్యంలోనే కృతి శెట్టి ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. మళయాళం ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అడగ్గా.. త్వరలోనే అని చెప్పింది. అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్.. రామ్ చరణ్ ఆరాధించే వ్యక్తి.. మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనూ.. రియల్ లైఫ్‌లోనూ సూపర్ స్టార్.. అంటూ చెప్పుకొచ్చింది.
తమిళ హీరో విజయ్ ఇన్‌స్పైరింగ్ స్టార్ అని.. అజిత్ చాలా నిజాయితీ గల వ్యక్తి అని ఫ్యాన్స్‌కు సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఫొటోలు బాగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్‌తో పాటు కృతి శెట్టి ఫొటోలు షేర్ చేశాడు. గంగిరెద్దుపై, ఆటోలో ఆమె పోస్టర్లు ఉన్నాయి. గంగిరెద్దుపై జనసేన పోస్టర్‌తో పాటు బేబమ్మ ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు అభిమానులు. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటీ అనగా.. నేను కూడా మీలాగే అభిమానిని అని చెప్పింది. పార్టీలకు దూరంగా ఇంట్లోనే ఉంటానంటూ నెటిజన్ల ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది బేబమ్మ.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…