Coriander Mint Leaves Juice : శరీరం మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది. శరీరలో విష పదార్థాల స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో అవయాయవాలు నెమ్మదిగా నాశనం మొదలవుతాయి. శరీరంలో అవయవాల పని తీరు కూడా మందగిస్తుంది. రక్తం ఎప్పుడైతే కలుషితం అవుతుందో రోగనిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది. దీని కారణంగా అలర్జీలు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తాయి. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో రక్తంలో మలినాలు పేరుకు పోతూ ఉంటాయి.
మన ఆరోగ్యాన్ని నిత్యం కాపాడే రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ కోసం అర కప్పు కొత్తిమీర, అర కప్పు పుదీనా ఆకులు, పావు కప్పు వేపాకులు తీసుకుని నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన ఆకులను మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ని ఫిల్టర్ సాయంతో వడగట్టాలి. ఈ జ్యూస్ లో పావు టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే రక్తంలోని మలినాలన్నీ తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది.
అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ జ్యూస్ కి ఉపయోగించే అన్ని ఇంగ్రిడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా చేసుకొని వారంలో రెండుసార్లు ఈ జ్యూస్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఎప్పుడైతే రక్తం శుద్ధి అవుతుందో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించి అధిక బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఈ జ్యూస్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…