Coriander Mint Leaves Juice : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ తాగితే.. ర‌క్తం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..

September 17, 2022 3:01 PM

Coriander Mint Leaves Juice : శరీరం మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది. శరీరలో విష ప‌దార్థాల‌ స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో అవయాయ‌వాలు నెమ్మదిగా నాశనం మొదలవుతాయి. శరీరంలో అవయవాల‌ పని తీరు కూడా మందగిస్తుంది. రక్తం ఎప్పుడైతే కలుషితం అవుతుందో రోగనిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది. దీని కారణంగా అలర్జీలు, అలసట, తలనొప్పి వంటి  సమస్యలు ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తాయి. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో రక్తంలో మలినాలు పేరుకు పోతూ ఉంటాయి.

మన ఆరోగ్యాన్ని నిత్యం కాపాడే రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ కోసం అర కప్పు కొత్తిమీర, అర కప్పు పుదీనా ఆకులు, పావు కప్పు వేపాకులు తీసుకుని నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన ఆకులను మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ని ఫిల్టర్ సాయంతో వడగట్టాలి. ఈ జ్యూస్ లో పావు టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే రక్తంలోని మలినాలన్నీ తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది.

take Coriander Mint Leaves Juice daily for healthy blood
Coriander Mint Leaves Juice

అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ జ్యూస్ కి ఉపయోగించే అన్ని ఇంగ్రిడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా చేసుకొని వారంలో రెండుసార్లు ఈ జ్యూస్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఎప్పుడైతే  రక్తం శుద్ధి అవుతుందో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించి అధిక బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఈ జ్యూస్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment