Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావు మా ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఎంత వివాదం అయిందో అందరికీ తెలిసిందే. తరువాత యాంకర్ అనసూయపై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే ఆయన అప్పుడప్పుడు యూట్యూబ్ చానల్స్‌కు ఇచ్చే ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నామని.. ఆ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ రావు గురించి ఏం మాట్లాడాలి ? ఆయన ఎంతో అనుభవమున్న నటుడు. ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ, అనుభవం కానీ సరిపోవని.. పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఆయన అలా అన్నప్పుడు తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని.. కోటశ్రీనివాస్ తెలిపారు.
నా జీవితంలో ఎప్పుడూ వేదికపై అలా కన్నీళ్లు రాలేదని.. పవన్ కళ్యాణ్ అన్న మాటలకు అరనిమిషం పాటు కళ్లనుంచి నీళ్ళు వచ్చాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న నటుడు. ఆయన తన గురించి అలా మాట్లాడేసరికి తనకు ఎంతో గొప్పగా అనిపించిందని.. అందుకనే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని.. అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…