RRR Movie : ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే పీరియాడికల్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై నేటికి (నవంబర్ 19) మూడేళ్లు అవుతోంది. సరిగ్గా (18-11-2018) రోజున రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫొటోను షేర్ చేస్తూ షూటింగ్ మొదలైనట్లు డీవీవీ సంస్థ ప్రకటించింది.
పాత పోస్ట్‌ని ఓ నెటిజన్ రీ ట్వీట్ చేస్తూ.. ‘డిప్లొమాలో ఉన్నప్పుడు మీరు సినిమా షూటింగ్ ప్రారంభించారు. నా బీటెక్ కూడా అయిపోతోంది. మూవీ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీం స్పందిస్తూ అతడికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. ‘ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము కూడా షూటింగ్ చేయలేదు’ అంటూ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమైనట్లు చెప్పకనే చెప్పింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి చూపే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…