Kota Srinivasa Rao : పవన్ కళ్యాణ్ అన్న మాటలకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి..!

November 19, 2021 9:07 PM

Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావు మా ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఎంత వివాదం అయిందో అందరికీ తెలిసిందే. తరువాత యాంకర్‌ అనసూయపై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే ఆయన అప్పుడప్పుడు యూట్యూబ్‌ చానల్స్‌కు ఇచ్చే ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు వైరల్‌ అవుతుంటాయి. ఇక తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Kota Srinivasa Rao said he cried when pawan kalyan made those comments

పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నామని.. ఆ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ రావు గురించి ఏం మాట్లాడాలి ? ఆయన ఎంతో అనుభవమున్న నటుడు. ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ, అనుభవం కానీ సరిపోవని.. పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఆయన అలా అన్నప్పుడు తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని.. కోటశ్రీనివాస్ తెలిపారు.

నా జీవితంలో ఎప్పుడూ వేదికపై అలా కన్నీళ్లు రాలేదని.. పవన్ కళ్యాణ్ అన్న మాటలకు అరనిమిషం పాటు కళ్లనుంచి నీళ్ళు వచ్చాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న నటుడు. ఆయన తన గురించి అలా మాట్లాడేసరికి తనకు ఎంతో గొప్పగా అనిపించిందని.. అందుకనే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని.. అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now