గురువారం, జూన్ 11, 2026
వినోదం

Kota Bommali OTT Release Date : న్యూ ఇయ‌ర్ స్పెష‌ల్ గిఫ్ట్.. ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన కోట బొమ్మాళి పీఎస్‌..

Kota Bommali OTT Release Date : ఇటీవ‌ల ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించిన చిత్రం కోట‌బొమ్మాలి పీఎస్. ఈ చిత్రంకి తేజా మార్ని దర్శకత్వం వహించ‌గా, ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్…

Kota Bommali OTT Release Date : న్యూ ఇయ‌ర్ స్పెష‌ల్ గిఫ్ట్.. ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన కోట బొమ్మాళి పీఎస్‌..

Kota Bommali OTT Release Date : ఇటీవ‌ల ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించిన చిత్రం కోట‌బొమ్మాలి పీఎస్. ఈ చిత్రంకి తేజా మార్ని దర్శకత్వం వహించ‌గా, ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ నాయాట్టు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం నిర్మాత‌ల‌కి మంచి లాభాల‌నే తెచ్చిపెట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న కోట బొమ్మాళి పీఎస్ న్యూ ఇయ‌ర్ వీకెండ్‌లో ఆహా ఓటీటీలో కోట బొమ్మాళి మూవీ స్ట్రీమింగ్ కానుంది. జ‌న‌వ‌రి 5న శ్రీకాంత్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు.దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కాక‌పోతే అదే స‌మ‌యంలో రానుంద‌ని అంటున్నారు. ఇక కానీ తర్వలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారట. ఇప్పటివరకు థియేటర్లలో మిస్ అయిన కోట బొమ్మాళి సినిమాను వచ్చే ఏడాది ఇంట్లోనే చూడొచ్చు.

Kota Bommali OTT Release Date know the platform and streaming
Kota Bommali OTT Release Date

షయానికి వస్తే మలయాళంలో అవార్డు విన్నింగ్ సినిమా నాయట్టు ఆధారంగా రూపొందింది. అయితే మలయాళ మాతృకను తెలుగు నేటివిటికి అనుగుణంగా పూర్తిగా మార్చి వేసి.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంగా సినిమాను తెరకెక్కించారు. అయితే స్క్రిప్టును దర్శకుడు తేజ మార్ని డీల్ చేసిన విధానం, పాత్రలను భావోద్వేగంగా మలిచిన విధానంతోనే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో డిటేయిలిటీ ఎక్కవ కావడంతో కొంత స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో కథను గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్ చెప్పిన తీరు వల్ల కొన్ని సీన్లు ఉద్దేగానికి గురిచేసేలా ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.