Heroines Remuneration : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే అవాక్క‌వుతారు..!

October 24, 2021 1:01 PM

Heroines Remuneration : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్ళకు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీకి ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లంతా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను బాగా ఫాలో అవుతున్నారు. హీరోయిన్ల రెమ్యూనరేషన్స్ ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ రేంజ్ లో ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆమె పేరుకు తగ్గట్లుగానే రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటోంది.

know these Heroines Remuneration you will be surprised

దర్శకనిర్మాతలు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నయనతార సినిమాకు రూ.4 కోట్ల నుండి రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందనేది సినీ వర్గాల టాక్. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ లో తన టాలెంట్ తో అద్దరగొడుతున్న రష్మిక మందన్న తను యాక్ట్ చేసే సినిమాలకు రూ.2.50 కోట్ల నుండి రూ.3 కోట్ల వరకు తీసుకుంటోంది.

సమంత విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈమె రూ.2.50 కోట్ల నుండి రూ.3.50 కోట్ల వరకు ప్రొడ్యూసర్స్ ని డిమాండ్ చేస్తోంది. నెక్ట్స్ కీర్తి సురేష్ విషయానికి వస్తే సినిమా సక్సెస్ అవుతుందా.. లేదా అనేది పక్కన బెట్టి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఒక్కో సినిమా కోసం రూ.2 కోట్లు తీసుకుంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటోంది.

ఉప్పెన సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించిన క్యూట్ గర్ల్ కృతి శెట్టి.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఈ అమ్మాయి కూడా తన రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రాంగ్ అయిపోయిందనేది టాక్. తాను యాక్ట్ చేసే సినిమాల కోసం ఏకంగా రూ.1 కోటి డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment