Khiladi Movie : స‌ర్‌ప్రైజ్‌.. హిందీలోనూ విడుద‌ల కానున్న ఖిలాడి..!

February 5, 2022 12:57 PM

Khiladi Movie : పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌లైన పుష్ప సినిమా హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. పుష్ప సినిమాకు హిందీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. దీన్ని బ‌ట్టి చూస్తే వారు భాష‌తో సంబంధం లేకుండా ఒరిజిన‌ల్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. దీంతో ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకున్న ఖిలాడి మేక‌ర్స్ ఆ మూవీని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఖిలాడి మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. అయితే అదే రోజున ఈ మూవీ హిందీలోనూ విడుద‌ల కానుంది. ఈ మేర‌కు మేక‌ర్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Khiladi Movie  to release in Hindi also
Khiladi Movie

ఖిలాడి మూవీ ద్వారా ర‌వితేజ పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప‌రిచ‌యం కానున్నారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది చిత్రాల‌కు హిందీ మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఏర్ప‌డింది. అందువ‌ల్లే ఖిలాడిని హిందీలోనూ రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని.. మేక‌ర్స్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన ఖిలాడి మూవీ తెలుగుతోపాటు హిందీలోనూ విడుద‌ల కానుంది.

ఈ మూవీకి ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ర‌వితేజ హీరోగా డ్యుయ‌ల్ రోల్ పోషించారు. పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇందులో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఖిలాడి మూవీ ఒరిజిన‌ల్ క‌థ క‌నుక హిందీ ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని మేక‌ర్స్ తెలిపారు. ఇటీవ‌ల విడుద‌లైన పుష్ప సినిమా హిందీలోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అందువ‌ల్లే ఖిలాడిని అక్క‌డ విడుద‌ల చేస్తున్నామ‌ని, ఈ మూవీ హిందీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని తెలిపారు. అయితే హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద ఖిలాడి మూవీ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment