Khiladi Movie : మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకు చెందిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. రవితేజ కెరీర్‌లోనే ఇవి అత్యుత్తమ గణాంకాలని విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాత కోనేరు సత్యనారాయణకు భారీ లాభాలు వచ్చాయని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఈ సినిమా దర్శకుడు రమేష్ వర్మకు ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఏకంగా రూ.1.15 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును నిర్మాత సత్యనారాయణ.. రమేష్ వర్మకు అందజేశారు.
సత్యనారాయణ తన సినిమాలకు పనిచేసే వారిపట్ల ఎంతో జాలి, దయ చూపిస్తారని పేరుంది. అందులో భాగంగానే దర్శకుడు రమేష్ వర్మకు ఆయన ఈ ఖరీదైన బహుమతిని ఇచ్చారు. ఇక గతంలోనూ రాక్షసుడు అనే సినిమా రిలీజ్ అయినప్పుడు సత్యనారాయణ.. ఆ సినిమా దర్శకుడికి ఏకంగా ఒక ఇంటినే బహుమతిగా ఇచ్చారు. అయితే ఖిలాడి చిత్రం విడుదల కాక ముందే ఇలా గిఫ్ట్ ఇవ్వడంతో చిత్ర వర్గాల్లో మరింత విశ్వాసం పెరిగింది. ఈ క్రమంలోనే ఖిలాడి మూవీ హిట్ అవుతుందని అంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…