Khiladi Movie : ఖిలాడి మూవీ ద‌ర్శ‌కుడికి నిర్మాత ఖ‌రీదైన కారు బ‌హుమ‌తి..!

January 30, 2022 12:07 PM

Khiladi Movie : మాస్ మ‌హారాజ ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఇప్ప‌టికే ఈ సినిమాకు చెందిన థియేట్రిక‌ల్‌, నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. ర‌వితేజ కెరీర్‌లోనే ఇవి అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Khiladi Movie producer given expensive car as a gift to director

కాగా ఈ సినిమా విడుద‌ల‌కు ముందే నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌కు భారీ లాభాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న ఈ సినిమా ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌కు ఖ‌రీదైన బ‌హుమ‌తి ఇచ్చారు. ఏకంగా రూ.1.15 కోట్ల విలువైన రేంజ్ రోవ‌ర్ కారును నిర్మాత స‌త్య‌నారాయ‌ణ‌.. ర‌మేష్ వ‌ర్మ‌కు అంద‌జేశారు.

స‌త్య‌నారాయ‌ణ త‌న సినిమాల‌కు ప‌నిచేసే వారిప‌ట్ల ఎంతో జాలి, ద‌య చూపిస్తార‌ని పేరుంది. అందులో భాగంగానే ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌కు ఆయ‌న ఈ ఖ‌రీదైన బ‌హుమ‌తిని ఇచ్చారు. ఇక గ‌తంలోనూ రాక్ష‌సుడు అనే సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు స‌త్య‌నారాయ‌ణ‌.. ఆ సినిమా ద‌ర్శ‌కుడికి ఏకంగా ఒక ఇంటినే బ‌హుమ‌తిగా ఇచ్చారు. అయితే ఖిలాడి చిత్రం విడుద‌ల కాక ముందే ఇలా గిఫ్ట్ ఇవ్వడంతో చిత్ర వ‌ర్గాల్లో మ‌రింత విశ్వాసం పెరిగింది. ఈ క్ర‌మంలోనే ఖిలాడి మూవీ హిట్ అవుతుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment