Karthikeya 2 : ప్రస్తుతం ఎక్కడ చూసిన కార్తికేయ 2 మానియానే కనిపిస్తుంది. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. తొలిరోజు లిమిటెడ్ స్క్రీన్‌లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫస్ట్‌డేకు మించిన కలెక్షన్ లను సెకండ్ డే సాధించి.. కంటెంట్ ఉంటే కలెక్షన్లకు తిరుగుండదని మరోసారి నిరూపించింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళను సాధించింది.
ముఖ్యంగా బాలీవుడ్‌లో రోజు రోజుకూ కార్తికేయ 2పై క్రేజ్ పెరిగిపోయింది. కార్తికేయ 2 చిత్రం బాలీవుడ్‌లో మొదటి రోజు కేవలం 60 స్క్రీన్‌లలో విడుదలైంది. ఇక రెండో రోజు ఏకంగా 300 స్క్రీన్లు పెరిగాయి. దీనికి పోటీగా అమీర్‌ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ వంటి సినిమాలున్నా బాలీవుడ్ ప్రేక్షకులు కార్తికేయ 2 చిత్రం వైపే మొగ్గు చూపారు. ఊహించని స్థాయిలో ఏకంగా రూ.120 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ చిత్రంతో యంగ్ హీరో నిఖిల్‌కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. థియేటర్లలో సందడి చేసి.. తాజాగా ఓటీటీని పలకరించింది.
థియేటర్లలో ఎగబడి చూసినా.. ఓటీటీలోనూ తన హవా కొనసాగించింది కార్తికేయ 2. దసరా సందర్భంగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఓటీటీలో విడుదలైన 48 గంటల్లోనే ఏకంగా 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని జీ5 స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. కృష్ణతత్త్వం నేపథ్యంలో తెరకెక్కిన కార్తికేయ 2 తెలుగు కంటే హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రల్లో నటించి మెప్పించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…