Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకీ ఆసక్తికరంగా కొనసాగుతోంది. సౌందర్య ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. కుటుంబం రెండు భాగాలుగా ఉంటూ ఆటలు ఆడుకుంటారు. సౌందర్య సంతోషంగా స్వీట్స్ చేసి తీసుకొస్తుంది. అసలైన దీపావళి ఈరోజే అని అందరికీ స్వీట్స్ పంచుతుంది. కార్తీక్, ఆదిత్య కుటుంబాలను పక్క పక్కన కూర్చోబెట్టి ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తుంది సౌందర్య.
మరోవైపు మోనిత ఓ లాయర్ ను ఇంటికి పిలిపించి అతడిని మళ్లీ ఏదో సహాయం అడుగుతుంది. ఈ సారి దీప ఎలాగైనా ఓడిపోవాలి.. అంటూ నేనే గెలవాలి అని మళ్లీ క్రూరత్వాన్ని బయట పెడుతుంది మోనిత. ఆ లాయర్ కూడా మోనితకు సపోర్ట్ చేయటంతో మళ్ళీ మోనిత ఏదో పెద్ద ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక లాయర్ మోనితకు ఏదో ప్లాన్ చెబుతూ అలా చేయమని అంటూ ఈ విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలని అంటాడు.
మోనిత ఎలాగైనా దీపను ఓడించాలని తానే ఎలాగైనా గెలవాలనుకొని తనకు తానే మాట ఇచ్చుకుంటుంది. ఇక కార్తీక్ దీప దగ్గరికి వెళ్లి మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పుస్తకంను బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తాడు. దీప ఆ పుస్తకం తీసుకొని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. అలా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కార్తీక్, దీప. వెంటనే దీప బస్తీలో ఉన్న వాళ్ల పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేవని అనడంతో కార్తీక్ క్యాంపు పెడతానని మాట ఇస్తాడు.
మోనిత ప్రియమణిని పిలిచి కార్తీక్ దగ్గరకు వెళ్దామని అనేసరికి ప్రియమణి షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కార్తీక్ క్యాంపు ఏర్పాటు చేయడంతో అక్కడికి బస్తీ వాళ్లు వచ్చి తమ పిల్లల ఆరోగ్యాలను చూపించుకుంటారు. అంతలోనే ఒక ఆవిడ తన భర్త తన పిల్లలను పట్టించుకోవడం లేదు అని అనేసరికి కార్తీక్ తండ్రి అయిన వాడు అలా చేస్తాడా అని అనేసరికి అప్పుడే మోనిత ఎంట్రీ ఇచ్చి కార్తీక్ కు షాక్ ఇస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…