Karthika Deepam : దీపకు బహుమతి ఇచ్చిన కార్తీక్.. మరో ప్లాన్ కు సిద్ధమవుతున్న మోనిత !

November 26, 2021 8:04 AM

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకీ ఆసక్తికరంగా కొనసాగుతోంది. సౌందర్య ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. కుటుంబం రెండు భాగాలుగా ఉంటూ ఆటలు ఆడుకుంటారు. సౌందర్య సంతోషంగా స్వీట్స్ చేసి తీసుకొస్తుంది. అసలైన దీపావళి ఈరోజే అని అందరికీ స్వీట్స్ పంచుతుంది. కార్తీక్, ఆదిత్య కుటుంబాలను పక్క పక్కన కూర్చోబెట్టి ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తుంది సౌందర్య.

Karthika Deepam 26 November 2021 Full Episode

మరోవైపు మోనిత ఓ లాయర్ ను ఇంటికి పిలిపించి అతడిని మళ్లీ ఏదో సహాయం అడుగుతుంది. ఈ సారి దీప ఎలాగైనా ఓడిపోవాలి.. అంటూ నేనే గెలవాలి అని మళ్లీ క్రూరత్వాన్ని బయట పెడుతుంది మోనిత. ఆ లాయర్ కూడా మోనితకు సపోర్ట్ చేయటంతో మళ్ళీ మోనిత ఏదో పెద్ద ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక లాయర్ మోనితకు ఏదో ప్లాన్ చెబుతూ అలా చేయమని అంటూ ఈ విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలని అంటాడు.

మోనిత ఎలాగైనా దీపను ఓడించాలని తానే ఎలాగైనా గెలవాలనుకొని తనకు తానే మాట ఇచ్చుకుంటుంది. ఇక కార్తీక్ దీప దగ్గరికి వెళ్లి మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పుస్తకంను బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తాడు. దీప ఆ పుస్తకం తీసుకొని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. అలా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కార్తీక్, దీప. వెంటనే దీప బస్తీలో ఉన్న వాళ్ల పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేవని అనడంతో కార్తీక్ క్యాంపు పెడతానని మాట ఇస్తాడు.

మోనిత ప్రియమణిని పిలిచి కార్తీక్ దగ్గరకు వెళ్దామని అనేసరికి ప్రియమణి షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కార్తీక్ క్యాంపు ఏర్పాటు చేయడంతో అక్కడికి బస్తీ వాళ్లు వచ్చి తమ పిల్లల ఆరోగ్యాలను చూపించుకుంటారు. అంతలోనే ఒక ఆవిడ తన భర్త తన పిల్లలను పట్టించుకోవడం లేదు అని అనేసరికి కార్తీక్ తండ్రి అయిన వాడు అలా చేస్తాడా అని అనేసరికి అప్పుడే మోనిత ఎంట్రీ ఇచ్చి కార్తీక్ కు షాక్ ఇస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now