Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్ ఇప్పుడు ఎమోషన్ మూడ్‌లో ఉంది. హౌజ్‌మేట్స్ ఫ్యామిలీని ఇంట్లోకి పంపిస్తున్న క్రమంలో సందడి వాతావరణం నెలకొని ఉంది. గత ఎపిసోడ్‌లో కాజల్ ఫ్యామిలీ సందడి చేయగా, గురువారం శ్రీరామ్ కోసం ఆమె సోదరి అశ్విని హౌస్‌లోకి వచ్చింది. అందరితో పలకరింపులు అయిపోయాక శ్రీరామ్‌కు గేమ్‌లో సలహాలు, సూచనలు ఇచ్చింది. కప్పు కొట్టి రావల్సిందే అని బామ్మ చెప్పిందని అశ్విని పేర్కొంది.
శ్రీరామ్ సోదరి వెళ్లిపోయాక మానస్ తల్లి పద్మిని ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె చాలా హుషారుగా కనిపించారు. ఫుల్ ఎనర్జీతో హౌస్‌లో సందడి చేశారు. మానస్ కూల్ అండ్ కామ్‌గా ఉంటే.. అతనికి విరుద్ధంగా ఉంది పద్మిని. ప్రియాంక.. మానస్ గేమ్‌ని డిస్టర్బ్ చేస్తుందన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పింది పద్మిని. ఇక రవి, షణ్ముఖ్, కాజల్ మీద తెగ పంచ్‌లు వేసింది.
ఇక శ్రీరామ్.. ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. అని అంటే.. ఆంటీ అంటావ్ ఏంటి ? అక్క అని అనండి.. అంటూ ఫుల్ స్వింగ్‌లో కనిపించారు మానస్ తల్లి. ఆ తరువాత శ్రీరామ్.. ఆంటీ మీరు ఏజ్ తగ్గించుకోవల్సిన అవసరం లేదు.. ఇప్పుడు కూడా హాట్‌గానే ఉన్నారని పంచ్ వేశాడు. మొత్తానికి హౌస్‌లో ఉన్నంతసేపూ పద్మిని అల్లాడించారు.
ఫుల్ ఎనర్జీతో అందర్నీ ఆటాడించారు. ఇక మానస్‌తో మాట్లాడుతూ గేమ్ చాలా బాగా ఆడుతున్నావని.. ప్రతి పేరెంట్స్ నిన్ను విన్నర్‌గా చూడాలని కోరుకుంటున్నారు.. వాళ్లని ఆశని నువ్ నిజం చేయాలంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కాకు.. అని సలహాలు ఇచ్చింది.
ఇక సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి రాగా షణ్ముఖ్‌ను నువ్వు హగ్ చేసుకోవడం నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పింది. తండ్రి లేని పిల్ల కదా.. షణ్ముఖ్ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదంది. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పగా సిరి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది. దీంతో షణ్ముఖ్ చాలా హర్ట్ అయ్యాడు. నా గేమ్ కూడా వదిలేసి ఇంత సపోర్ట్ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు.
మరోవైపు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రియాంక.. మానస్‌ను నిలదీసింది. నువ్వు నా దగ్గరనుంచి ఎక్కువగా ఆశిస్తున్నావని, నేను ఫ్రెండ్‌గా వచ్చి మాట్లాడితే నీకు ఇంతేనా అనిపిస్తుందంటూ.. ఆమెను ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని.. నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…