Kalyan Dhev : ఫుల్ చిల్ అవుతున్న మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్.. ఫోటోలు వైరల్..!

March 7, 2022 5:27 PM

Kalyan Dhev : మెగా అల్లుడిగా విజేత సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్తగా అందరికీ పరిచయమే. ఇక గత కొంత కాలం నుంచి కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడనే వార్తలు వినబడుతున్నాయి. గత క్రిస్మస్ నుంచి మెగా కుటుంబంలో జరిగే ఒక్క సెలబ్రేషన్స్ కి కూడా ఆయన హాజరు కాలేదు. అలాగే శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాలలో కళ్యాణ్ పేరును తొలగించడంతో ప్రతి ఒక్కరూ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.

Kalyan Dhev latest photos viral on social media
Kalyan Dhev

ఈ విధంగా శ్రీజ, కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఇటు మెగా కుటుంబం గానీ లేదా అటు కళ్యాణ్ దేవ్ కానీ ఏమాత్రం స్పందించలేదు. ఇక మెగా కుటుంబం కళ్యాణ్ సినిమాలకు కూడా ఏమాత్రం ప్రమోషన్స్ నిర్వహించకపోవడంతో వీరి మధ్య ఏవో మనస్పర్థలు తలెత్తాయనే అనుమానాలు వస్తున్నాయి.

ఇలా వీరి గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ కళ్యాణ్ దేవ్ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన తదుపరి చిత్రం కిన్నెరసాని సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలను చూస్తుంటే కళ్యాణ్ తన లైఫ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేసిన కళ్యాణ్ దేవ్ వీకెండ్ ముందు తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment