Kajal Aggarwal : అందాల తార కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తరచూ పోస్టులు పెడుతోంది. కోవిడ్ లాక్ డౌన్‌లోనూ పలు ఆసక్తికరమైన వీడియోలు, పోస్టులతో ఫాలోవర్లను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈమె తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోతో షేర్ చేసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈమె 2020 లో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకోగా వారికి ఈ మధ్యే ఏప్రిల్ లో మగ బిడ్డ జన్మించాడు. ఇక వీరి బిడ్డ పేరుని నీల్ అని కూడా ప్రకటించారు. అయితే ఆమె తాజాగా బాహుబలి సినిమాలోని అప్పుడే పుట్టిన బాహుబలి కాలుని కట్టప్ప తన తలపై పెట్టుకునే సన్నివేశాన్ని అనుకరిస్తూ తన కొడుకు నీల్ కాలుని తన తలపై పెట్టిన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. దానికి దర్శకుడు రాజమౌళిని కూడా టాగ్ చేసింది. అలాగే రాజమౌళిని ఉద్దేశిస్తూ సార్ ఇది మీ పట్ల నాకు ఇంకా నా కొడుక్కి ఉన్న అభిమానానికి ఆయనకి డెడికేట్ చేయకుండా ఎలా ఉండగలను అని రాసింది.
ప్రస్తతం కాజల్ భారతీయుడు 2, కరుణ్గాపియం, ఉమా అనే సినిమాల్లో నటిస్తోంది. అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న భారతీయుడు 2 మూవీలో కాజల్ హీరోయిన్ గా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈమె సెప్టెంబర్ 13 నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననుందని సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…