Kajal Aggarwal : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీలు యూఏఈ గోల్డెన్ వీసా పొందుతున్నారు. ఆ వీసా ఉండడం అంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక మంది స్టార్స్ ఆ వీసా పొందారు. ఇక తాజాగా చందమామ కాజల్ అగర్వాల్ ఈ వీసాను పొందింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
యూఏఈ గోల్డెన్ వీసా పొందినందుకు చాలా సంతోషంగా ఉందని, తమలాంటి స్టార్స్‌ను యూఏఈ ప్రోత్సహిస్తుందని, అందుకు గాను ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. పేర్కొంది. ఇక ఈమెకన్నా ముందు నటి త్రిష కూడా ఈ వీసాను పొందింది.
ఫరా ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి.. రీసెంట్‌గా సానియా మీర్జాలకు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. పలు ప్రత్యేక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రోత్సాహకంగా ఈ వీసాను యూఏఈ ప్రభుత్వం అందిస్తోంది.
ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి కాగా.. ఈమె నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సినామికా అనే తమిళ సినిమా, ఉమ అనే హిందీ మూవీలోనూ ఈమె నటించగా.. అవి కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…